మరోసారి సల్మాన్‌ ఆగ్రహం, వీడియో వైరల్‌

సాక్షి,ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి నడిచి వస్తున్న  హీరో  సల్మాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి.  దీనిపై  కోపం తెచ్చుకున్న  సల్మాన్‌  ఈ వ్యక్తి నుండి మొబైల్‌ చటుక్కున లాక్కున్నా డు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.